సిరి - షన్నుల బంధంపై రవి షాకింగ్ కామెంట్స్
on Nov 30, 2021
బిగ్‌బాస్ సీజన్ 5 నుంచి తాజాగా యాంకర్ రవి ఎలిమినేట్ కావడం సంలచనం సృష్టిస్తోంది. రవిని కావాలనే ఇంటికి పంపించారంటూ అతని ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట రవి ఎలిమినేషన్ హాట్ టాపిక్‌గా మారింది. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన రవి అనూహ్యంగా 12వ వారం ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటికి రావడం చాలా మందికి డైజెస్ట్ కావడం లేదు. అతని ఫ్యాన్స్ అయితే బిగ్‌బాస్ హౌస్ సెట్ వేసిన అన్నపూర్ణ స్టూడియోస్ ముందు ఓ రేంజ్‌లో రచ్చ చేశారు.
రవిని ఎలిమినేట్ చేయడం ఓ కుట్ర అని, ఇది అన్‌ఫేర్ అంటూ బిగ్‌బాస్ నిర్వాహకులపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదిలా వుంటే అరియానా గ్లోరీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ బజ్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన యాంకర్ రవి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు. మరీ ముఖ్యంగా షన్ను, సిరిల రిలేషన్షిప్‌పై షాకింగ్ కామెంట్స్ చేయడం ప్రాధాన్యతని సంతరించుకుంది. తాను ఎలిమినేట్ అవుతానని అస్సలు ఊహించలేదని, ఇప్పటికీ ఇది నాకు షాకింగ్‌గానే వుందన్నాడు రవి.
ఇక హౌస్‌లో చాలా మంది తనని `గుంటనక్క` అన్నా పెద్దగా పట్టించుకోలేదని, నటరాజ్ మాస్టర్ ఏదో ఇంటెన్షన్‌తోనే హౌస్‌లోకి వచ్చాడని అభిప్రాయపడ్డాడు. తనకు తెలిసి తాను ఎవరినీ ఇఫ్లూయెన్స్ చేయలేదని, ఒకవేళ తన మాటలకు ఇంటి సభ్యులు ఇఫ్లూయెన్స్ అయ్యారేమో అన్నాడు. ఇక హౌస్‌లో లిప్‌లాక్‌లు, హగ్గులతో రచ్చ చేస్తున్న సిరి, షన్ను జంట రిలేషన్‌షిప్‌పై స్పందించాడు రవి. షణ్ముఖ్.. దీప్తిని ఎంతగా లవ్ చేస్తాడో.. సిరి కూడా శ్రీహాన్‌ని అంతగా లవ్ చేస్తుందని చెప్పాడు. కానీ హౌస్‌లో మాత్రం సిరి.. షన్నుని ఇష్టపడుతోందని షాకింగ్ కామెంట్ చేశాడు. ఈ విషయాన్ని సిరి తనతో చెప్పిందని.. `అన్నా ఐ లైక్ హిమ్` అని సిరి ఓపెన్ అయిందని రవి చెప్పడం గమనార్హం.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
